వయస్సు మరియు శారీరక ఆరోగ్యంపై ఆధారపడి, ఉప్పు తీసుకోవడం మంచిది. సాధారణంగా WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) సూచనల ప్రకారం, ఏ వయసు వారు రోజువారీగా ఎంత ఉప్పు తీసుకోవాలో చూద్దాం…
పిల్లలు (1-3 సంవత్సరాలు వరకు) రోజుకు సుమారు 2 గ్రాములు (800 మిల్లిగ్రాములు సోడియం) తీసుకోవాలి.
4 – 6 సంవత్సరాల పిల్లలు రోజుకు సుమారు 3 గ్రాములు (1,200 మిల్లిగ్రాములు సోడియం) తీసుకోవడం మంచిది.
7-10 సంవత్సరాల వారు రోజుకు సుమారు 5 గ్రాములు (2,000 మిల్లిగ్రాములు సోడియం) తీసుకోవాలి.
పెద్దవారు మాత్రం రోజుకు 5 గ్రాములు లేదా అంతకంటే తక్కువ తీసుకోవడం మంచిది.
అతిగా ఉప్పు తీసుకోవడం అధిక రక్తపోటు, గుండె సమస్యలు, మూత్రపిండ సంబంధిత వ్యాధులకు కారణం కావచ్చు.
గమనిక : మీరు ఉన్న ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా, డాక్టర్ లేదా పోషకాహార నిపుణుడు సలహా తీసుకోవడం ఉత్తమం.