జగిత్యాల జిల్లా, మల్యాల:
రేపు మల్యాల లో 2వ జిల్లా మహాసభలు A.I.T.U.C జిల్లా ఉపాధ్యక్షులు ఇరుగురాల భూమేశ్వర్ పిలుపు…
ఈనెల 26 న జగిత్యాల జిల్లా మల్యాల లో జరగబోయే జగిత్యాల జిల్లా బీడీ కార్మికుల (AITUC) అనుబంధ సంఘం మహాసభను జయప్రదం చేయాలని జిల్లా నాయకులు ఇరుగురాల భూమేశ్వర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా లక్ష పైచిలుకు కార్మికులు ఉంటారని పేర్కొన్నారు బీడీ పరిశ్రమ సంక్షోభంలో అనేక హక్కులు సంక్షేమ పథకాలు కోల్పోతున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల వల్ల ఈ బీడీ కట్టల పైన నిండు డేంజర్ గుర్తులు వేయడం బీడీ ఆకు కొనడం, బీడీ కట్టల అమ్మకంపై GST ని పెంచి అనేక రకాల నిషేధాలు పెట్టడం మూలంగా కొంతమేరకు ఉపాధిని కార్మికులు కోల్పోయి పని లేని పరిస్థితి ఏర్పడింది.
ESI హాస్పిటల్ ను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి. బీడీ పరిశ్రమపై పలుమార్లు పెంచుతున్న GST పన్నును తగ్గించాలి.
విద్యార్థులకు సంక్షేమ పథకాలు అయినా బీడీ స్కాలర్ షిప్, ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం ఇతర పథకాలు యధావిధిగా కొనసాగించాలి.
EPFO సంస్థలో P. F కు రాజీనామా అనంతరం బీడీ కార్మికులకు కనీస పెన్షన్ 6000 రూపాయలు ఇవ్వాలి.
చాలీచాలని వేతనాలతో తమ జీవితాలను నెట్టుకొస్తున్న బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ మహాసభను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ మహాసభలో బీడీ కార్మికులు పెద్ద ఎత్తున వారు ఎదుర్కొంటున్న సమస్యలను మహాసభ దృష్టికి తీసుకురావడంతోపాటు చర్చలో పాల్గొని కార్మిక వర్గ ప్రజా సంఘ నిర్మాణానికి పునాదులు వేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, జిల్లా నాయకులు శనిగారపు ప్రవీణ్, శ్రీ గాద దేవదాసు, వెన్న మహేష్,మండల A.I.T. U.C కన్వీనర్ రాచర్ల సురేష్, మండల మహిళ బీడీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.