తెలుగు సినీ నటుడు మహేశ్ బాబు సౌరశక్తి ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించనున్నట్లు సమాచారం. ట్రూజన్ సోలార్(సన్జక్ లిమిటెడ్) తో కలిసి సౌరశక్తి వ్యాపార రంగంలోకి ఆయన ఎంటర్ కానున్నట్లు తెలుస్తోంది.
ఇందులో ఆయన భారీగా పెట్టుబడులు పెట్టనున్నారని టాక్ నడుస్తోంది. కాగా మహేశ్ ఇప్పటికే రెయిన్ బో హాస్పిటల్స్, ఏఎంబీ సినిమాస్ లో ఇన్వెస్ట్ చేశారు. ఇవి కాక పలు బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు.