తెలంగాణలో గత కొన్నినెలల నుంచి సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

టెలిగ్రామ్ లో తెలియని నంబర్/గ్రూప్ నుంచి వచ్చే లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్త సినిమాలు, వీడియోల పేరుతో లింక్స్ షేర్ చేస్తున్నారని, ఈలింక్స్ క్లిక్ చేస్తే సైబర్ క్రిమినల్స్ చేతిలోకి మన పర్సనల్ డేటా వెళ్లే ప్రమాదముందని తెలిపారు.