రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించే పాఠశాల పాఠ్యపుస్తకాల్లో ఈసారి రాష్ట్ర గేయాన్ని కూడా చేర్చనున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి (2025-26) ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రక్రియ ప్రారంభమైంది.

ఈ మేరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగానికి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. తెలుగు, సాంఘికశాస్త్రం లాంటి కొన్ని సబ్జెక్టుల పుస్తకాల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ముద్రించే అవకాశముంది.