ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయాల పునర్నిర్మాణానికి టెండరు ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలో పనులు ప్రారంభించి 2026లో జరిగే మహాజాతర నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఈ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.1.92 కోట్లు మంజూరు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభించి మహాజాతర కంటే ముందే నిర్మాణం పూర్తి చేస్తామని మేడారం ఆలయ EO రాజేంద్రం తెలిపారు.