సినిమాలను వదిలేస్తానంటూ డైరెక్టర్ సుకుమార్ చెప్పిన ఓ వీడియో వైరలవుతోంది.

‘సుకుమార్ గారూ.. మీరు ఒకవేళ DHOP అని చెప్పి దేన్ని వదిలేయాలనుకుంటున్నారు?’ అని ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ అడగగా ‘సినిమా’ అని ఆయన బదులిచ్చారు. దీంతో రామ్ చరణ్ సహా అందరూ షాకయ్యారు. ‘DHOP’ అంటే వదిలిపెట్టడం అని అర్థం. బెంగాలీలో ఇదే పదానికి ‘అబద్ధం’ అనే అర్థం కూడా ఉంది.