రాష్ట్రంలో గృహ విద్యుత్ వినియోగం, లోడు గరిష్ఠ స్థాయికి చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) తొలి 6 నెలల్లో(ఏప్రిల్-సెప్టెంబరు) కొత్తగా 6,42,692 కరెంటు కనెక్షన్లు ఇచ్చినట్లు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు తాజాగా ప్రభుత్వానికి నివేదించాయి.
వీటితో కలిపి ఇళ్ల కరెంటుకనెక్షన్లు ప్రస్తుతం 1.40కోట్లకు చేరాయి. గతనెలలో నిర్వహించిన సమగ్ర కుటుంబసర్వే ప్రకారం రాష్ట్రంలో ఉన్న మొత్తం కుటుంబాలు 1.16 కోట్లుగా తేలింది.