ఇంటర్ ప్రాక్టికల్స్ కోసం ప్రైవేటు కాలేజీల్లో CCTV కెమెరాల ఏర్పాటుకు యాజమాన్యాలు అంగీకరించాయని బోర్డు అధికారులు వెల్లడించారు.

రేపటి నుంచి ఈనెల 22 వరకు జరగనున్న పరీక్షలకు 4.29 లక్షల మంది హాజరు కానుండగా, 2,008 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. హాల్ టికెట్లను కాలేజీ లాగిన్లతో పాటు విద్యార్థుల ఫోన్లకు పంపుతున్నామన్నారు. రెండు సెషన్లలో (9am-12pm, 2pm-5pm) పరీక్షలు జరుగుతాయన్నారు.