నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తరపున నేడు, రేపు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

గెలుపే లక్ష్యంగా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఢిల్లీ ప్రజలకు వివరించనున్నారు. కాగా రేపటితో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.