ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల స్థానానికి ఆరుగురు, టీచర్ల స్థానానికి ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు.

టీచర్స్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి తో పాటు తొమ్మిది మంది 13 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో ఇద్దరు అభ్యర్థులు గ్రాడ్యుయేట్, టీచర్స్ స్థానానికి రెండిట్లోనూ నామినేషన్లు దాఖలు చేశారు.