మందుబాబులకు మరో బిగ్ షాక్ తగలనుంది. రాష్ట్రంలో కింగ్ ఫీషర్ బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు యునైటెడ్ బ్రూవరీస్ ప్రతిపాదనలు చేయగా.. ప్రభుత్వం సైతం దీనికి సుముఖత వ్యక్తం చేసినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారం.
ఒక్కో బాటిల్ పై ధర రూ.20 – 25 పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ వేసవిలో డిమాండ్కు తగ్గట్టు బీర్లు సరఫరా చేసి రాష్ట్ర ఖజానాను పెంచే దిశగా ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టిందట.