రాష్ట్రంలో వివిధ రకాల నిర్మాణాలు, సదుపాయాల కల్పనకు సంబంధించి అనుమతుల ప్రక్రియ సులభతరంగా ఉండాలని CM రేవంత్ అన్నారు.
ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సింగిల్ విండోలో అనుమతి లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ‘రెవెన్యూ, మునిసిపల్, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్, ఫైర్ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా పనిచేయాలి. ఆస్తులు, వనరుల గుర్తింపునకు లైడార్ సర్వే చేపట్టాలి’ అని దిశానిర్దేశం చేశారు.