భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
పాల్వంచ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫోటోగ్రాఫర్ల ఫ్రెండ్లీ టోర్నమెంట్ సూరారం క్రికెట్ గ్రౌండ్ లో జరిగింది.
ఫైనల్లో లగాన్ టీమ్, ఆల్ఫా టీమ్ తలపడగా 12 పరుగుల తేడాతో లగాన్ టీమ్ విజయం సాధించింది. అనంతరం మండల అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము అని,ఇలా టోర్నమెంట్ నిర్వహించడం వలన ఫోటోగ్రాఫర్స్ మధ్యలో స్నేహ భావం పెంపోదించుటకు ఉపయోగపడుతుందని అన్నారు.
ఈ టోర్నమెంట్ కి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవస్థాప అధ్యక్షులు మైలవరపు రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వనచర్ల రామకృష్ణ, కొత్తగూడెం కొత్త మండల ప్రధాన కార్యదర్శి గౌరీ శంకర్, కోశాధికారి గడ్డం ప్రభాకర్, పాల్వంచ కార్యవర్గ సభ్యులు అప్పారావు, నరేష్, రఫీ, ప్రతాప్,విద్యాసాగర్, వీరభద్రం, వీరబాబు లు పాల్గొన్నారు.
సీనియర్ ఫోటోగ్రాఫర్లు సుభాని, అల్లి రాము, సూర్యం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.