భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
బిసి ప్రజాప్రతినిధుల ఫోరమ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర జరిగిన BCల మహా ధర్నాలో పాల్గొన్న వనమా రాఘవేందర్ హాజరైన వందలాది కొత్తగూడెం నియోజకవర్గ బిసి నాయకులు.
స్థానిక సంస్థలలో 42% వెనుకబడిన తరగతుల (BCPF) రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ
BCల హక్కుల కోసం సాగుతున్న ఈ పోరాటానికి కొత్తగూడెం నియోజకవర్గం నుంచి బలమైన మద్దతు తెలియజేస్తూ వనమా రాఘవేందర్ ఆధ్వర్యంలో బిసి నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు చురుకుగా పాల్గొన్నారు.
ఈ బిసి మహా ధర్నాలో జాతీయ బిసి సంఘం భద్రాద్రి జిల్లా యువజన అధ్యక్షులు బత్తుల మధుచంద్, మాజీ ఆత్మ కమిటీ ఛైర్మెన్ బత్తుల వీరయ్య, బిసి నాయకులు ముత్యాల ప్రవీణ్, MD హుస్సేన్, మధుసూదన్ రావు, జూపెల్లి దుర్గా ప్రసాద్, బండ్ల పవన్ తదితరులు పాల్గొన్నారు.