భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️ దుర్గా ప్రసాద్
కాంగ్రెస్ నాయకులు మనోహర్ పేద ప్రజల బాగోగుల కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి మనోహర్ దశదినకర్మల్లో కొత్వాల పాల్గొన్నారు.
సోమవారం పాల్వంచ పట్టణ పరిధి ఘట్టాయిగూడెం లోని మనోహర్ స్వగృహంలో ఫ్లెక్సీకి కొత్వాల, ఆయన కుమారుడు పాల్వంచ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్ తో కలసి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల్వంచ ప్రాంతం ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న వ్యక్తి మనోహర్ అన్నారు. మనోహర్ ఆత్మకు శాంతి చేకూర్చాలని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, వై వెంకటేశ్వర్లు, ఉండేటి శాంతి వర్ధన్, మాలోత్ కోటి నాయక్, నల్లమల సత్యం, కాపర్తి వెంకటాచారి, షేక్ చాంద్ పాషా, డిష్ నాగేశ్వరరావు, శ్రీలత రెడ్డి, అరుణ రెడ్డి, ఎస్ కే భాష, మల్లికార్జున్, శివ, డప్పు రాము, గద్దె రాఘవయ్య, అలెక్స్, జగన్నాథం అజిత్, నరేష్, వేణు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.