భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

జులై 12 2025 న కేటీపీస్ 7వ దశ కార్యాలయం లో కేటీపీస్ సి ఈ శ్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేస్ పాటిల్ మరియు కేటీపీస్ CE శ్రీనివాస రావు తో,కార్మిక నాయకుల తో మీటింగ్ లో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రివర్యులు, ఎంపీ శ్రీమతి రేణుకాచౌదరి గారు, కేటీపీస్ 8 వ దశ విస్తరణ సాధ్యాసాధ్యాల, సాంకేతిక కారణాల పైన చర్చించి 8 వ దశ విస్తరణ విషయం లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించి 8 వ దశ విస్తరణ కొరకు కృషి చేస్తా అని హామీ ఇచ్చారు.

ఈ 8 వ దశ ను పూర్తి చేస్తే కేటీపీస్ లో ఆధనం గా మరో 800 మెగా యూనిట్ల విద్యత్తు ను ఉత్పత్తి చేయవచ్చునని, ఉద్యోగ ఉపాధి పెరుగుతుందని, గతం లో తాను కేంద్ర మంత్రి గా వున్నప్పుడు కేటీపీస్ 7 వ దశ ను ఏర్పాటు చేపించి నష్టాలలో వున్న కేటీపీస్ ను లాబాల వైపు తీసుకు వచ్చి ఉద్యోగాలు పెంచటానిక కృషి చేశానని అన్నారు.