భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
దివ్యాంగులకు ఆర్థిక ప్రోత్సాహక పథకం (ఎకనామికల్ రిహాబిలిటేషన్ స్కీం) క్రింద జిల్లా లో గల దివ్యాంగులకు జీవనోపాధి అవకాశాలను కల్పించడం కొరకు ఋణాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గాను 100% రాయితీతో 50,000/- వేల చొప్పున 27 యూనిట్లు, 80% రాయితీతో లక్ష రూపాయల (01) యూనిట్, 60% రాయితీతో మూడు లక్ష రూపాయల (01) యూనిట్ మంజూరు చేసినారు.
కావున అర్హులైన దివ్యాంగులు tgobmms.cgg.gov.in వెబ్ సైట్ నందు ఈ నెల తేది:14-07-2025 నుండి 31-07-2025 లోపు ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకొనవలసినదిగా శ్రీమతి. స్వర్ణలత లేనినా, జిల్లా సంక్షేమ అధికారి, స్త్రీ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారు తెలియజేయడం జరిగినది.
ఇతర వివరాలకు 6301981960, 8331006010 నంబర్లను సంప్రదించగలరు.