✍️దుర్గా ప్రసాద్
తెలంగాణ ములుగు జిల్లా కన్నాయిగుడెం మండలంలోని గుత్తికొయ గూడాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా అనూహ్యంగా వాల్ పోస్టర్లు కనిపించాయి.
‘ప్రజా ఫ్రంట్’ పేరిట వెలిసిన ఈ పోస్టర్లు మావోయిస్టుల తీరుపై విమర్శలు గుప్పించాయి. ‘సిద్ధాంతం కోసం అడవిలోకి వెళ్లిన అన్నల్లారా, అక్కల్లారా మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యుడికి ఎప్పుడైనా ఆశాకిరణంగా మారిందా?’ అని ప్రశ్నించారు.