ఆదిలాబాద్ జిల్లా
✍️దుర్గా ప్రసాద్

జీవో నెంబర్ 49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బంద్ ను విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తమ హక్కుల కోసం, ముఖ్యంగా జీవో నెంబర్ 49 రద్దు కోసం ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తామని అన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా వాణిజ్య చిరు వ్యాపారస్తులు ప్రైవేట్ ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు ఉద్యోగ ఉపాధ్యాయ మేధావి యువజన విద్యార్థి మహిళ కార్మిక కర్షక వర్గాల ప్రజలు బుద్ధి జీవులు ప్రజాస్వామిక వాదులు ప్రజా సంఘాల బాధ్యులు రాజకీయ పార్టీల నాయకులు ఆదివాసి సంఘాల నాయకులు అందరూ కూడా ముందుగా సమాచారం అందించి జిల్లా మండల్ డివిజన్ గ్రామస్థాయి నుంచి స్వచ్ఛందంగా పూర్తిస్థాయిలో బందు పాటించి ఆదివాసులకు సహకరించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.