భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
పాల్వంచ సొసైటీకి పంట రుణాలకు 33 లక్షల రూ// మంజూరు – సొసైటీ అధ్యక్షులు కొత్వాల
“కొత్త రుణాలకు అర్హులైన రైతులు ఆగస్టు 1 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి-కొత్వాల”పాల్వంచ కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా రైతులు పంట రుణాలకు గాను 33 లక్షల రూ// లు మంజూరు అయ్యాయని సొసైటీ అధ్యక్షులు, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
బుధవారం పాల్వంచ సొసైటీ కార్యాలయంలో పాలకవర్గం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ…
2025-26 ఖరీఫ్ సీజన్ కు గాను DCCB ద్వారా ఇప్పటి వరకూ రుణాలు పొందని కొత్త వారికి, సొసైటీ ద్వారా రుణాలు తీసుకున్న రైతులకు వారి అర్హత ప్రకారం అదనంగా ఇచ్చుటకు కేటాయించారన్నారు. కొత్తగా రుణాలకు దరఖాస్తు చేసుకునే రైతులు ఆగస్టు 1 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కొత్వాల అన్నారు.
రైతులు తమ భూమి వివరాలతో పట్టాదారు పాసుబుక్, 1- బి, పహాని, ఈసి, నో డ్యూస్, ఆధార్ తో పాటు నాలుగు ఫోటోలు సొసైటీ కార్యాలయంలో ఇవ్వవచ్చని అన్నారు. సొసైటీ ద్వారా రైతులకు ఎమ్మార్పీ ధరలకే ఎరువులు, సబ్సిడీపై విత్తనాలు పంపిణీ, ధాన్యం కొనుగోలు, సభ్యులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం, రుణాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని కొత్వాల అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల అన్నారు.
ఈ సమావేశంలో సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, డైరెక్టర్లు బుడగం రామ్మోహనరావు, కనగాల నారాయణరావు, చౌగాని పాపారావు, సామా జనార్దన్ రెడ్డి, మైనేని వెంకటేశ్వరరావు, జరబన సీతారాం బాబు, భూక్య కిషన్, నిమ్మల సువర్ణ, బర్ల వెంకటరమణ, సొసైటీ సీఈఓ జి లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.