మంచిర్యాల జిల్లా,
తేదీ:18 జూలై 2025,
✍️మనోజ్ కుమార్ పాండే.
మంచిర్యాల జిల్లాలో ఒకే రోజు రెండు చోట్ల దాడులు నిర్వహించారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
ఈ ఇద్దరూ కూడా కార్మిక శాఖ అధికారులు కావడం గమనార్హం… మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. రూ.50 వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ లేబర్ అధికారి రామ్మోహన్ పట్టుబడ్డారు. డీఎస్పీ మధు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
ఇక, బెల్లంపల్లి సహాయ కార్మిక అధికారి కార్యాలయం పై కూడా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఇక్కడ ఓ మహిళ వద్ద నుండి రూ.30 వేలు లంచం తీసుకుంటుడగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుకన్యను పట్టుకున్నారు. ఈ మేరకు రెండు చోట్ల ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.