మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:19 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే
బెల్లంపల్లి పట్టణంలోని లోటస్ పాఠశాలలో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగ బోనాలు. బోనాల పండుగ సందర్భంగా విద్యార్థులు ఇళ్లలో తయారు చేసిన నైవేద్యాన్ని(బోనాన్ని) తలపై పెట్టుకొని వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బగ్గం శేషుకుమార్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు చిన్ననాటి నుండే మన సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు అమ్మవారు,పోతరాజు వేషధారణలో పాల్గొన్నారు. విద్యార్థులు,ఉపాధ్యాయులు అందరూ కలిసి బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు.