✍️దుర్గా ప్రసాద్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి సంబరాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో వారం పాటు ఈనెల 24వ తేదీ వరకు సంబరాలు నిర్వహించనుంది.

మహిళల ఆర్థిక సాధికారత కోసం రూపొందిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతోంది. మంత్రుల బిజీ షెడ్యూల్ వల్ల కొన్ని నియోజకవర్గాల్లో సంబరాలు పూర్తి కాకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.