పట్టణంలో డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన… – ప్రత్యేక స్టాల్ ద్వారా విక్రయాలు…
భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
మణుగూరు
✍️దుర్గా ప్రసాద్
మున్సిపాలిటీలోని మెప్మా, ఆధ్వర్యంలో స్వయంశక్తి సంఘాలు తయారుచేసిన విక్ర యిస్తున్న ఉత్పత్తులు పలువురిని ఆకట్టుకుంటున్నాయి.
శనివా రం పట్టణంలోని పూల మార్కెట్ చౌరస్తాలో స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేసి పలురకా ల చేతి ఉత్పత్తులను ప్రదర్శించి అమ్ముతున్నారు. స్టాల్ లో ప్రత్యే క ఆకర్షణలు పలురకాల ఉత్ప త్తులైన, జూట్ బ్యాగ్స్, మేదరి వస్తువులు, చేనేత వస్త్రా లు, హెర్బల్ ఆయిల్స్, సబ్బులు, వివి ధ రకాల పచ్చళ్ళు, సమోసా లు, అల్లికలు, లిప్రాన్ వర్క్ తో తయారు చేసిన మెమెంటోలు, వంటి పలురకాల ఉత్పత్తులు ఈ ఈ స్టాల్ లో అందుబాటులో ఉన్నాయి.
పలు ఉత్పత్తులు ఇక్కడ ఆకర్షణగా నిలుస్తున్నా యి.మండలంలోని పలుస్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఇక్కడ విక్రయించడంతో పాటు చేనేత వస్త్రాలు, హస్తకళలు, ఆహార పదార్థాలు, మార్కెట్ రేటు కంటే ఇక్కడ తక్కువ ధరలకు అమ్ముతున్నారు.