భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
✍️దుర్గా ప్రసాద్

కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇన్చార్జిగా నియమితులైన ఎంపీ రఘురాంరెడ్డిని సన్మానించిన రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాలతోపాటు కాంగ్రెస్ నాయకులు

కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించిన ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి ని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు తో పాటు కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు.

శుక్రవారం రాత్రి కొత్తగూడెంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం సందర్భంగా పాల్వంచ మండలానికి చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురాంరెడ్డిని ఇన్చార్జిగా నియమితులైనందుకు శాలువా బొకేలతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్, మాజీ జెడ్పిటిసి ఎర్రం శెట్టి ముత్తయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాలే జానకి రెడ్డి, పెద్దమ్మ గుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ఆర్టిఏ నెంబర్ బాదర్ల జోషి కుమార్, సీనియర్ అడ్వకేట్ అయిత గంగాధర్, కాంగ్రెస్ నాయకులు దర్మసోత్ ఉపేందర్, ఎర్రంశెట్టి మధుసూదన్ రావు, వాసం మంగయ్య, వై వెంకటేశ్వర్లు, ప్రసాద్, అనిత, గిరిప్రసాద్, డిష్ నాగేశ్వరరావు, నాగిరెడ్డి, వెంకటరెడ్డి, గిరిప్రసాద్,ఆవుల మధు తదితరులు పాల్గొన్నారు.