మంచిర్యాల జిల్లా కేంద్రం
తేదీ:19 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మంచిర్యాల జిల్లా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 23 వ తేదీన తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ ను విజయవంతం చేయాలనీ పీడీఎస్.యు జిల్లా కార్యాలయం మార్క్స్ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా పీడీఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ధాగం శ్రీకాంత్, ఏ.ఐ.ఎస్.బి జిల్లా కార్యదర్శి కనుకుంట్ల సన్నీ గౌడ్, ఏ.ఐ.ఎఫ్.డి.ఎస్. రాష్ట్ర సహాయ కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనా అందిస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ 2 సంవత్సరలు కావొస్తున్న కూడ ఇప్పటి వరకు పెండింగ్ బకాయిలను విడుదల చేయకపోగా కనీసం విద్యా రంగంలో ఎదురకొంటున్న సమస్యలపై ఒక సమీక్షా సమావేశం నిర్వహించకుండా ఇప్పటివరకు విద్య శాఖ మంత్రిని నియమించకుండా, ప్రభుత్వ విద్యను ధ్వంసం చేస్తూ ప్రవేట్, కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ విచ్చలవిడిగా ప్రవేట్ యూనివర్సిటీలకు అనుమతులిస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రకు తెరలేపిందాన్నారు.

ప్రజా పాలనా అని మాటల్లో చెపుతూ, ఆచరణలో అప్రజాస్వామ్య పాలనా కొనసాగుతుందన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, పెండింగ్ బకాయిలు పెట్టకుండా, విద్యా రంగంలో ఉన్న ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తూ, ఫీజు నియంత్రన చట్టం తీసుకోస్తు, విద్యార్థులందరికి ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని, జాతీయ నూతన విద్య విధానాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలనీ డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23 న తలపెట్టిన విద్య సంస్థల బంద్ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని బంద్ ను విజవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పీడీఎస్.యూ జిల్లా ఉపాధ్యక్షులు పి.సికిందర్, ఎస్.ఎఫ్.ఐ జిల్లా సహాయ కార్యదర్శి నిఖిల్, ఏఐ.ఎఫ్. డీ .ఎస్.పి.వెంకటేష్, ఏ.ఐ.ఎస్.బీ జిల్లా నాయకులు సుమంత్, ఏ.ఐ.ఎస్.ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.