భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
కుల మతాలకతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవులు జరుపుకునే ముస్లింల పండుగ కౌడిపీరీల పండుగ అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
మొహర్రం పండుగ అనంతరం వారి సోదరులు అయిన కౌడిపీరీలు (ఇమామ్ కాసిం, మౌలాలి, నాలే హైదర్) పండుగను 10 రోజులు నిర్వహిస్తారు. శుక్రవారం రాత్రి చివరి రోజున కౌడిపీరీలను పాత పాల్వంచ లోని వీధులలో ఊరేగించారు.
ఈ కార్యక్రమంలో కొత్వాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీకగా నిర్వహించే పండుగ కౌడిపీరీలు పండుగ అని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్, కాంగ్రెస్ నాయకులు వై వెంకటేశ్వర్లు, కౌడిపీరీల నిర్వాహకులు బాబుమీయా అజ్మత్ అలీ, యాకుబ్ అలీ, గుమ్ష అలీ, జాకీర్, హఫీజ్, రహమత్ అలీ, యాసిన్ పాషా, మౌలాలి, పిల్లల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.