భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

సిపిఐ సీనియర్ నాయకుడు. సిపిఐ మాజీ పట్టణ సహాయ కార్యదర్శి బూర్గుల దాసు దేహ నిర్యాణం చేయడం జరిందని, అనారోగ్యంతో శనివారం రాత్రి ఒంటిగంట సమయంలో హైదరాబాద్ హాస్పిటల్ లో మరణించారు.

ఆయన మరణవార్త విన్న ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్మోహన్ రావు గారు బూర్గుల దాసు గృహానికి చేరుకొని మృతదేహాన్ని సందర్శించి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు

బూర్గుల దాసు మరణం పట్ల సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ ముత్యాల విశ్వనాథ దాసు భౌతికాయాన్ని సందర్శించి విప్లవ నివాళులర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

టిడిపి రాష్ట్ర నాయకులు కనగాల అనంత రాములు మరణ వార్త తెలిసిన వెంటనే నివాళులర్పించారు. ఆ కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి రాష్ట్ర సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు. సిపిఐ మండల కార్యదర్శి విశంశెట్టి పూర్ణచంద్రరావు సీపీఐ మాజీ పట్టణ కార్యదర్శి కొమ్మవరపు ఆదాము. వీసంశెట్టి విశ్వేశ్వరరావు అన్నారపు వేంకటేశ్వర్లు నరహరి నాగేశ్వరావు వివిధ రాజకీయ నాయకులు అంతిమయాత్ర పాల్గొన్నారు