భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
పాల్వంచ త్రివేణి పాఠశాలలో అంగరంగ వైభవంగా జరిగిన బోనాల సంబరాలు స్థానిక పాల్వంచ పట్టణంలోని దమ్మపేట సెంటర్లో గల త్రివేణి పాఠశాలలో ఆషాడ మాస బోనాల సంబరాలు అంబరాన్నంటాయి.
పాఠశాలలోనే ఉపాధ్యాయులు అంతా కలిసి పాఠశాల ప్రాంగణాన్ని మామిడి తోరణాలతో మరియు అందమైన పూల రంగవల్లులతో సుందరంగా ముస్తాబు చేశారు. తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పాఠశాలలోని విద్యార్థులులా చేత అమ్మవారికి బోనాలను సమర్పించారు.
అమ్మవార్లు వేషధారణలో పలువురు చిన్నారులు ఎంతగానో అలరించారు పోతురాజు వేషధారణలో విద్యార్థి అందరినీ ఆశ్చర్యపరిచాడు అమ్మవారికి పూలమాలలు వేసి పూజారికాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు అనంతరం విద్యార్థులు బోనాల డాన్సులు చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి గారు సి ఆర్ ఓ కాట్రగడ్డ మురళీకృష్ణ గారు ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఈ రామ్మూర్తి గారు మరియు కిడ్స్ ఇన్చార్జి కవిత గారు ఇతర బోధ నేతర సిబ్బంది పాఠశాల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.