మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 21 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే
శ్రావణ సోమవారం సందర్భంగా దేవాపూర్ ప్రాంతం భక్తులు మంచిర్యాల గోదావరి జలాలను తీసుకొచ్చి, దేవాపూర్ ఆలయంలో పూజలు చేయించి, దేవాపూర్ నుండి కవాడ్ (గంగా జలం) లతో భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ పాదయాత్రగా బెల్లంపల్లి కన్నాల శివారులోని ప్రాచీన బుగ్గ రాజ రాజేశ్వర ఆలయానికి చేరుకుని ఆ గంగా జలంతో అభిషేకించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… శ్రావణ మాసంలో శివునికి గంగా జలంతో అభిషేకం చేస్తే ప్రకృతికి మేలు జరుగుతుందని, అందరూ సుభిక్షంగా ఉంటారని, నేటి యువతలో ఆధ్యాత్మికతా భావం పెంపొందించాలని ఈ కార్యక్రమమును చేపట్టామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
