భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు
✍️దుర్గా ప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలానికి చెందిన అశోక్‌నగర్ గ్రామవాసి ఎస్.కె. ఇస్మాయిల్ పాషా గారు బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థలో 40 సంవత్సరాల పాటు విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు.
ఈ సందర్భంగా కిన్నెర కళ్యాణ మండపంలో నిర్వహించిన ఘనమైన పదవీ విరమణ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ముఖ్య అతిథిగా హాజరై పాషా గారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
ఇస్మాయిల్ పాషా గారి సేవలు అభినందనీయం అంటూ, పదవీ విరమణ అనంతరం వారి జీవితం ఆరోగ్యంగా, సుఖంగా గడవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరనాకి నవీన్, నాయకులు గాండ్ల సురేష్, కోర్స ఆనంద్, బొజ్జా త్రిమూర్తులు, ఎం.డి. రహీం పాషా, ఠాగూర్ పద్మ తదితరులు పాల్గొన్నారు.
