✍️దుర్గా ప్రసాద్

జీఓ 49ను నిలిపివేస్తూ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ గజిట్ విడుదల చేసింది.

గత కొన్ని రోజుల నుంచి జీవో 49ను నిలిపియాలని చెయ్యాలని మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వానికి, మంత్రులు సీతక్క ఆదిలాబాద్ ఇంచార్జి మంత్రి జూపెల్లి కృష్ణ రావు, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్దిలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్బంగా సెకరిటీయేట్ లో రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు గారు మాట్లాడుతూ
ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్న జీవో 49ను ప్రభుత్వం నిలిపివేసిందని చేసిందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

గత నెల ఉట్నూర్ లో ఆదివాసులతో సమావేశామైన జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు ఆదివాసుల మనోగతం, GO వచ్చిన తర్వాత ఆదివాసుల ఆవేదన, ఆందోళన గురించి ముఖ్యమంత్రి గారితో వివరిస్తూ, అటవీ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ, పంచాయతీ రాజ్ మంత్రి శ్రీమతి దనసరి సీతక్క గార్లతో ప్రత్యేక సమావేశము ఏర్పాటు చేసి GO గురించి వివరాలు తెలుసుకొని ఆదివాసులకు అన్యాయం చేసే GO ని నిలిపి వేసిందన్నారు.

టైగర్ కన్జర్వేషన్ కారిడార్ పేరిట ఆదివాసుల హక్కులకు తీవ్ర విగాతం కలిగించే జీవో 49 ఆపివేయాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల ఆదివాసులు అందరు హర్షం వెక్తం చేస్తున్నారని, ఆసిఫాబాద్ జిల్లాలోని 339 గ్రామాలకు ఈ జీవో అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని, దీన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించడం జరిగిందని, ఇటీవలనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర గిరిజన శాఖ మంత్రి ఓరం, రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను, గిరిజన శాఖ మంత్రి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని, మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖలను కలిసి వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగిందన్నారు.

ఈ జీవో అమలు అయితే గిరిజనుల అస్తిత్వం కోల్పోతారని, అటవీ అధికారుల పెత్తనం పెరుగుతుందని వివరించడం జరిగింది. గిరిజనులు గిరిజనేతరులు ఆందోళనను గుర్తించిన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు జీవో ఆపివేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.మాజీ ఎంపీ వెంట మంత్రి సీతక్క ఎమ్మెల్లే బొజ్జు పటేల్,మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆసిఫాబాద్ డిసిసి విశ్వ ప్రసాద్ తదితరులు ఉన్నారు.