భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
భద్రాచలం నియోజకవర్గం.
✍️దుర్గా ప్రసాద్

భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు సతీమణి ప్రవీణ గారు.

రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారిని కోరుకున్నారు.

అనంతరం స్వామి వారి కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.