✍️దుర్గా ప్రసాద్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు తెలంగాణ భవన్ లో మహిళా శిశు ఆరోగ్య సంరక్షణకు గాను “కేసీఆర్ కిట్స్” పంపిణీ చేశారు.ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు, మాతాశిశుల ఆరోగ్య సంరక్షణకు గాను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు “కేసీఆర్ కిట్స్” పథకాన్ని ప్రవేశపెట్టి వారికి అవసరమైన వస్తువులతో పాటు 13వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం కూడా అందించిన విషయం తెలిసిందే.
ఈ మంచి కార్యక్రమాన్ని కేసీఆర్ పై ఉన్న కోపంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేసింది. కాగా, ఈనెల 24వతేదీన కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో “గిఫ్ట్ ఏ స్మైల్” సుమారు 5వేల మంది మహిళలకు “కేసీఆర్ కిట్స్”అందజేశారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బీఆర్ఏస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రి, పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, వీ.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు కే.పీ.వివేకానంద, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎంపీలు రావుల చంద్రశేఖరరెడ్డి, బాల్క సుమన్ తదితర ప్రముఖులతో కలిసి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఏస్ నాయకులు డాక్టర్ ఆర్.ఏస్.ప్రవీణ్ కుమార్, వీ.దేవీప్రసాద్ రావు,అయాచితం శ్రీధర్, ప్రేమ్ కుమార్ ధూత్, నరేందర్, గజ్జెల నగేష్,కోతి కిశోర్ గౌడ్, మన్నె గోవర్థన్ రెడ్డి, మన్నె కవిత, సుమిత్రా ఆనంద్, ఆర్.వీ.మహేందర్ తదితరులు హాజరయ్యారు.
