భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
సుజాతనగర్.
✍️దుర్గా ప్రసాద్
సోమవారం రోజు జరిగిన హఠాత్ పరిణామానికి కేసుపాక కుటుంబం కొంత ఆర్థిక నష్టాన్ని కోల్పోయిందని ( 13 మేకలు) చనిపోయాయని తెలుసుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించిన బత్తుల వీరయ్య ఆత్మ కమిటీ చైర్మన్ జరిగిన నష్టానికి సుజాతనగర్ పశువుల వైద్యాధికారిని సంప్రదించి జరిగిన నష్టాన్ని జిల్లా ప్రథమ పౌరుడు గౌరవ కలెక్టర్ గారికి విన్నవించి ఆ కుటుంబానికి ఆర్థిక నష్టాన్ని ప్రభుత్వం ద్వారా గా సహాయం అందించాలని,కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబానికి సరైన నష్టపరిహారం అందించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ప్రముఖ ఆర్ఎంపి వైద్యులు మామిడాల సాంబశివరావు, జక్కుల పాల్గుణ బీసీ సంఘం నాయకులు గాజుల కృష్ణ టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు, కత్తి బాలకృష్ణ, గరికే వెంకటనారాయణ, చిల్లటూరి సుధీర్ కుమార్ మాచిన శ్రీకాంత్, కుక్కమూడి వెంకటేష్, సాత్విక్, కాకాటి, గద్దల దుర్గారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
