మెదక్ జిల్లా
మాసాయిపేట మండలం
✍️శివ కుమార్ గౌడ్

సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని టిపిసిసి కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు.

మాసాయిపేట మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించారు. పలు గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వారు పరిశీలించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ…

గత ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి సొంత ఇంటి కల నెరవేరుస్తున్నట్టు తెలిపారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరోవైపు సాగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి మాజీపేట మండల అధ్యక్షుడు శ్రీకాంత్ నాగిరెడ్డి మాజీ ఎంపిటిసి సిద్ధిరాములు గౌడ్ సొసైటీ డైరెక్టర్ ఊదండపురం నర్సింలు గ్రామ అధ్యక్షుడు గుండారం శ్రీనివాస్ శంకర్ వెంకటేష్ శీను పరమేష్ తదితరులు పాల్గొన్నారు.