భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
✍️దుర్గా ప్రసాద్
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం
మంగళవారం భద్రాద్రి జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటుగా పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వం ప్రధానంగా మహిళల ఆర్థిక, సామాజిక, సాధికారతకే ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవంలా వడ్డీ లేని రుణాల పంపిణీ జరుగుతుందన్నారు. మహిళలను మహారాణులుగా గౌరవిస్తూ, వారికి ఆర్థికంగా స్వావలంబన కల్పించేలా అనేక మార్గాల్లో ముందడుగు వేస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత అందిస్తోందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉండి ముందుకు నడిపిస్తోందన్నారు. ఇదే క్రమంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ప్రమాద భీమా, రుణ భీమా కల్పనతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి, పాఠశాలలు, క్యాంటీన్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ, స్కూల్ యూనిఫామ్‌ల తయారీ, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ పనులు మహిళలకే అప్పగిస్తూ, వారికి ఉపాధి నిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలొ సోసైటీ చైర్మన్ మండే వీర హనుమంత్ రావు, మాజీ డీసీఎంస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, కొత్తగూడెం ఆర్డిఓ మధు, డీఎస్ఓ రుక్మిణి, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్, చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి తాసిల్దార్ లు, మహిళా సంఘాలు సభ్యులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
