మంచిర్యాల జిల్లా కేంద్రం
తేది: 23 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించి ఆసుపత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు.

ఆసుపత్రిలో నూతన పరికరాల ఏర్పాటు కొరకు అందించిన ప్రతిపాదనలను పరిశీలించడం జరుగుతుందని, ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందించడంతో పాటు మందులను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.