మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:23 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి సీపీఐ నేతలు పట్టణ మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ కు పట్టణ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులలో కలుషిత మురికి నీరు కలిసిన నీటిని మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్నారు. అట్టి నీటిని ప్రజలు వాడడం ద్వారా ప్రజల ఆరోగ్యం చెడిపోయి వ్యాధిగ్రస్తులవుతున్నారు. కావున స్వచ్ఛమైన నీరును పట్టణ ప్రజలఖండించి రోగాల బారిన పడకుండా కాపాడగలరని కోరారు.

పట్టణంలోని అన్ని వార్డులలో దోమల బెడద నివారణకు దోమల మందును స్ప్రే (ఫాగింగ్) చేయించాలని, అన్ని వార్డులలో డ్రైనేజీలు క్లీన్ చేయడం లేదు. వెంటనే డ్రైనేజీలు క్లీన్ చేయించగలరని, సింగరేణి ఏరియా హాస్పిటల్ నుండి కన్నాల బస్తి ఫ్లై ఓవర్ వరకు మెయిన్ రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి ప్రమాదాలు గురవుతున్నారని, రోడ్డును వెంటనే మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని, పైన తెలిపిన సమస్యల గురించి ఇది వరకు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రము ఇచ్చినా ఫలితం లేదని అన్నారు. ఇప్పటికైనా పట్టణ ప్రజల ప్రధాన సమస్యలపై స్పందించి వెంటనే పరిష్కరించగలరని కోరారు.

ఈ సమస్యలు పరిష్కరించని పక్షంలో మునిసిపల్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనలను జరుపుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బొల్లం పూర్ణిమ రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ, కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.