మంచిర్యాల జిల్లా,
మందమర్రి,
తేది: 23 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలం అందుగులపేట గ్రామంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు- 2025 లో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, భూగర్భ గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట వేసిందని అన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించే పలు కార్యక్రమాలు చేపట్టిందని, మహిళలు సద్వినియోగపరచుకోవాలని కోరారు.
