మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి
తేదీ 23 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో జనహిత అన్నపూర్ణ అన్న దాన కార్యక్రమం 350 వ సారి బెల్లంపల్లి పట్టణం కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ వద్ద చేసారు.
ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని ఆకలి తో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని దాతల సహకారంతో జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13 వ తేదీ 2021 న ప్రారంబించారని దాతల సహకారంతో ప్రతి బుధవారం నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ సుమారు ఇరవై నాలుగు లక్షల వ్యయంతో కొన్ని వేల మందికి ఆకలి తీర్చారని తేలిపారు.
ఈ రోజు 350 వ సారి దాత చంద్రవెల్లి గ్రామ వాస్తవ్యులు కీ.శే. కామెర లక్ష్మీ ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు యాచకులకి, నిరుపేదలు, కూలీలు, చిరువ్యాపారులు, బాటసారులకి ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్న దాన కార్యక్రమం నిర్వహించారని, ఈ కార్యక్రమం లో సుమారు 180 మందికి ఒక పూట భోజనం అందించడం జరిగిందని ఈ జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం విజయవంతం కొరకు మరింత మంది దాతలు ముందుకు రావాలని అలాగే సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు మరియు జనహిత సేవా సమితి ఉపాధ్యక్షుడు కందుల రాజన్న, సహాయ కార్యదర్శి పంతంగి సంతోష్, కార్యవర్గ సభ్యులు డోలి సుకుమార్, భీమిని కనకయ్య, పాతకాల కుమార్, చిరంజి సత్యనారాయణ, నిచ్చకోల గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.
