భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
ప్రముఖ నాట్యాచార్యులు, అభినయ కూచిపూడి నాట్య నిలయం నిర్వాహకులు, KTPS రిటైర్డ్ ఉద్యోగి మారీదు శాంతి మోహన్ వృద్దాప్యంతో మృతి చెందారు. పాల్వంచ గోవర్ధన గిరి కాలనిలోని ఆయన నివాసంలో ఉంచిన భౌతికకాయాన్ని బుధవారం రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సందర్శించి, భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.
ఈ సందర్బంగా కొత్వాల మాట్లాడుతూ…
నాట్యాచార్యులుగా శాంతి మోహన్ తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన వ్యక్తి అని, వేలాది మంది విద్యార్థులకు, యువతీయువకులకు కూచిపూడి, భరత నాట్యంలలో తీర్చిదిద్దారన్నారు. జాతీయ, రాష్ట్రాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి, అనేక అవార్డులు పొందారని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్, మణి, సాంబ, సునీల్, వేముల కొండలరావు, పాకాపాటి రోషయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
