సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో 79 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.35.74లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
పోలీసు యూనిఫామ్‌లో ఉన్న నేరగాళ్లు వృద్ధుడికి ఫోన్ చేసి.. మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని సీబీఐ పేరుతో బెదిరించారు.
దీంతో భయపడిపోయిన వృద్ధుడు వారిఖాతాకు రూ.35.74లక్షలు బదిలీ చేశాడు. అనుమానం వచ్చి వారికి తిరిగి కాల్ చేస్తే వాళ్లు స్పందించకపోవడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
