మంచిర్యాల జిల్లా కేంద్రం
✍️మనోజ్ పాండే

టీయూడబ్ల్యూజే(ఐజేయు)
మంచిర్యాల జిల్లా కార్యవర్గ సమావేశం ఈ నెల 25 శుక్రవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సింగరేణి సీఈఆర్ క్లబ్ లో నిర్వహిస్తున్నట్లు యూనియన్ అధ్యక్షులు డేగ సత్యం, ప్రధాన కార్యదర్శి సంపత్ రెడ్డి, ఏరియా ఉపాధ్యక్షులు మద్దెల సంజీవ్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

అనంతరం మందమర్రి మండల యూనియన్ సభ్యులతో సమావేశం నిర్వహించబడుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా అనర్హుల వాహనాలపై ప్రెస్ లోగో స్టికర్ల తొలగింపు పై పోలీసు అధికారులకు విన్నవించడం, యూనియన్ సభ్యులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించుట,ఒక మండలంలో ఒక్కటే ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలనే అంశాలపై చర్చ ఉంటుంది. అనంతరం స్థానిక సభ్యుల ద్వారా సమస్యల విన్నపాలు స్వీకరణ, యూనియన్ కట్టుబాట్లు, నియమ నిబంధనల గురించి గౌరవ పెద్దలు సూచనలు చేస్తారని తెలిపారు.