భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణంలో జిఎస్ కన్స్ట్రక్షన్ హాల్లో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు మూడో తేదీన హైదరాబాదులో ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించే వైశ్య రాజకీయ రణభేరిని విజయవంతం చేయాలని వైశ్యవికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సత్యనారాయణ గుప్తా అన్నారు.

బుధవారం వైశ్య రాజకీయ రణభేరి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ మాట్లాడుతూ… రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యులకు 30 ఎంపీపీ, 30 జెడ్పిటిసి, కనీస ఒక జడ్పీ చైర్మన్, ఒక మేయర్, 15 మున్సిపల్ చైర్మన్ స్థానాలకు అవకాశం కల్పించాలన్నారు. ఈడబ్ల్యు ఎస్ లో వర్గీకరణ తెచ్చే వరకు వైశ్య వికాస వేదిక పోరాడుతూనే ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో కొదుమూరి దయాకర్ , చవ్వ సంతోష్ కుమార్ గిరిధర్ , సంక రవి, సర్వేష్ , మహంకాళి సాయి , పెండ్యాల సతీష్ పాల్గొన్నారు.