భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
వెంకటాపురం మండలం యాకన్నగూడెం రాళ్లవాగు వద్ద ఉద్ధృతంగా నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేసినట్లు ఎస్సై తిరుపతిరావు తెలిపారు.
కొద్ది రోజుల క్రితం రాళ్లవాగు వంతెన పై నుంచి ద్విచక్రవాహనం,ఆటోలను వెళ్లనిచ్చారు. కాగా పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోవడంతో రాకపోకలు ఆపివేసినట్లు తెలిపారు.
దీనిని గమనించి ఏటురునాగారం, మణుగూరు మీదుగా భద్రాచలం వెళ్లాలని వాహనదారులకు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.
