భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు భారీ నుంచి అతి భారీ వర్షపాత సూచన ఉన్న నేపథ్యంలో ఈరోజు (24.07.2025) ఏ సమయంలోనైనా కిన్నెరసాని డ్యాం గేట్లు ఎత్తి వరద నీటిని దిగువ గల కిన్నెరసాని నది/వాగులోకి వదలబడును.
కావున ఈరోజు (24.07.2025) కిన్నెరసాని నది పరివాహక ప్రాంత ప్రజలు వ్యవసాయ అవసరాలకు గాని మరి ఏ ఇతర అవసరాలకు కిన్నెరసాని నదిని దాటే ప్రయత్నం చేయరాదు.
ప్రస్తుతం కిన్నెరసాని రిజర్వాయర్ నీటిమట్టం : 403.70 అడుగులు
#A.E – కిన్నెరసాని ప్రాజెక్టు.
