మంచిర్యాల జిల్లా
బెల్లంపల్లి
✍️మనోజ్ పాండే
బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సంతోష్ అడ్డ కూలీల విషయమై వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎం సిపిఐయు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ…
గత కొన్ని సంవత్సరాలుగా డెత్, మ్యారేజ్,డెలివరీ ఫైల్ మీద ప్రభుత్వం నుండి రావాల్సిన డబ్బులు అందక రెక్కడితే గాని డొక్కాడని నిరు పేదలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అదేవి ధంగా లేబర్ కార్డు ల వల్ల కూలి పనిచేసుకొనే వారికి ఎన్నో బెనిఫిట్స్ వున్నాయని ఆ యొక్క బెనిఫిట్స్ కోసం అవగాహన సదస్సులు నిర్వహించి, లేబర్ కార్డుల వల్ల వచ్చే లాభాలను ప్రజలకు తెలియజేశాల్సిన అవసరం లేబర్ అధికారుల మీద ఉందని, వెంటనే లేబర్ కార్డు మీద అవగాహన సదస్సులు, అదే విధంగా అడ్డాకూలీలకు వచ్చే బెనిఫిట్స్ ను వచ్చే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఎంసీపీఐ(యు) పార్టీ తరుపున డిమాండ్ చేశారు.
