మంచిర్యాల జిల్లా,
మందమర్రి,
తేదీ: 24 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మందమర్రి మున్సిపాలిటీ పరిధి ఊరు మందమర్రి, ఊరి చెరువు ఆక్రమణకు గురై, అక్రమ కట్టడాలు వెలిశాయని వాటిని తొలగించి చెరువు భూమిని కాపాడాలని ఫిర్యాదులు సమర్పించి ఏడాది కావస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారా…? అనే ప్రశ్న తలెత్తుతుందన్నారు.

నోటీసులు జారీ చేసినట్లయితే పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్.

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు, పట్టించుకోకపోవడం నిర్లక్ష్యమా లేక నాయకుల అండదండలా అనే సందేహాలు కలుగుతున్నాయన్నారు ముల్కల్ల రాజేంద్రప్రసాద్.

మందమర్రి ఊరి చెరువులో అక్రమ నిర్మాణాలు తొలగించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని లేని యెడల బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గాజుల శంకర్, మండల అధ్యక్షుడు ఎండి మతిన్ ఖాన్, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రహీం బాబా, పట్టణ నాయకులు సత్తారపు నారాయణ, షేక్ అలం తదితరులు పాల్గొన్నారు.